భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label చరణములే నమ్మితి. Show all posts
Showing posts with label చరణములే నమ్మితి. Show all posts

Friday, May 21, 2010

చరణములే నమ్మితి

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి

వారధి గట్టిన వర భద్రాచల
వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే ||

ఆదిశేష నన్నరమర చేయకు
మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||

వనమున రాతిని వనితగ జేసిన
చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే ||

పాదారవిందమే యాధారమని నేను
పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే ||

వెయ్యారు విధముల కుయ్యాలించిన
అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||

బాగుగ నన్నేలు భద్రాచల రామ
దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||


Download