భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label గరుడగమన రారా. Show all posts
Showing posts with label గరుడగమన రారా. Show all posts

Thursday, May 20, 2010

గరుడగమన రారా

గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరవులేక నీ
మరుగుజొచ్చితిని అరమర సేయకు || గరుడ ||

పిలువగానెరమ్మి అభయము తలుపగానె యిమ్మి
కలిమి బలిమి నాకిలలో నీవని
పలువరించితిని నను గన్నయ్య || గరుడ ||

పాలకడలి శయన దశరధ బాల జలజనయన
పాలముంచు నను నీటముంచు నీ
పాలబడితి నిక జాలముసేయక || గరుడ ||

ఏలరావు స్వామి నను యిపుడేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని
ఏలరావు కరుణాలవాల హరి || గరుడ ||

ఇంత పంతమేల భద్రగిరీశ వరకృపాల
చింత లణచి శ్రీరామదాసుని
అంతరంగ పతివై రక్షింపుము || గరుడ ||


Download