భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label శరణాగత రక్షణ. Show all posts
Showing posts with label శరణాగత రక్షణ. Show all posts

Friday, May 21, 2010

శరణాగత రక్షణ

శరణాగత రక్షణ బిరుదుని నే శరణంటి గదయ్యా
వెరవకుమని యభయం బొసంగవే నన్నుగన్న తండ్రివయ్యా

కరివరదా సిరులొసగును దశరథ నందన రావయ్యా
నిరతము నీనామము జిహ్వకు రుచి గొననియ్యనయ్యా

నరహరి బాలునిగాచిన శ్రీజగన్నాథా వినవయ్య
గరుడ వాహనుడవై కన్నుల గానుపింపవయ్యా

ఆదిదేవ మీ చిత్తము భాగ్యము భావమెవరిదయ్యా
నీ దాసులకును నేదాసుడ దయ యుంచి యేలుమయ్యా

హరి నీతోటి సమాన దైవము మాకింకె వరయ్యా
కరుణా సాగరుడవని మొరలిడ గావ వదేమిటయ్యా

కోరితి నాదైవము నీవేయని దూరితి గదువయ్యా
నేరములెంచక గారవించి కృప జూడు నల్లనయ్యా

ముద్దుగుల్కగా రామదాసుడని ముచ్చటాడుమయ్యా
పరుల నీడేర్చెడి భద్రాచలపతి నీవే గదయ్యా