భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label కంటి మా రాములను. Show all posts
Showing posts with label కంటి మా రాములను. Show all posts

Thursday, May 20, 2010

కంటి మా రాములను

కంటి మా రాములను కనుగొంటి నేను || కంటి ||

కంటి నేడు భక్త గణముల బ్రోచు మా
యింటి వేలుపు భద్రగిరినున్న వాని || కంటి ||

చెలు వొప్పుచున్నట్టి సీతా సమేతుడై
కొలువు తీరిన మా కోదండరాముని || కంటి ||

తరణికుల తిలకుని ఘన నీలగాత్రుని
కరుణారసము కురియు కందోయి గలవాని || కంటి ||

హు రు మంచి ముత్యాలసరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వు మోముగలిగిన వాని || కంటి ||

ఘలు ఘల్లుమను పైడిగజ్జెలందెలు మ్రోయగ
తళుకు బెళుకు పాదతలము గలిగిన వాని || కంటి ||

కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప
శర చాపములు కేల ధరియించు స్వామిని || కంటి ||

ధరణిపై శ్రీరామదాసు నేలెడు వాని
పరమ పురుషుండైన భద్రగిరిస్వామిని || కంటి ||