భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label అమ్మ నను బ్రోవవే. Show all posts
Showing posts with label అమ్మ నను బ్రోవవే. Show all posts

Thursday, May 20, 2010

అమ్మ నను బ్రోవవే

అమ్మ నను బ్రోవవే రఘురాముని
కొమ్మ నను గావవే మా || అమ్మ ||

అమ్మ నను బ్రోవవే సమ్మది తోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద || అమ్మ ||

కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో || అమ్మ ||

యుల్లములోన మీయుభయుల నెరనమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు || అమ్మ ||

చలముమాని భద్రశైల రామదాసు
నలసటబెట్టక యాదరణ జేసి || అమ్మ ||